జైనూర్, వెలుగు : ఆదివాసీలు ఆరాధ్యులుగా కొలుస్తున్న హైమన్ డార్ఫ్– బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి మర్లవాయిలో శనివారం జరుగనుంది. వర్ధంతిని అధికారికంగా నిర్వహించడానికి ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు ఆదివాసీలు మర్లవాయి గ్రామంలోని డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద పూజలు చేసి నివాళులు అర్పిస్తారు.
అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. హైమన్ డార్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డార్ఫ్ స్మారక క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసారి వర్ధంతి రోజునే బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. హైమన్డార్ఫ్ మినీ లైబ్రరీ ని డిజిటల్ లైబ్రరీగా ఆధునీకరించేందుకు అధికారులు సిద్ధం చేశారు.